4 July, 2026 | 2:31 PM

దొడ్డి కొమురయ్య పోరాటం నేటి తరానికి స్ఫూర్తి

04-07-2026 01:57 PM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ 

కామారెడ్డి, జూలై 4 (విజయక్రాంతి): దొడ్డి కొమురయ్య పోరాటం నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచిందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ అన్నారు. శనివారం కామారెడ్డి కలెక్టరేట్లో దొడ్డి కొమురయ్య వర్ధంతి(Doddi Komaraiah Death Anniversary) నీ బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వహించారు. దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ మాట్లాడుతూ దొడ్డి కొమురయ్య తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాంది పలికిన తొలి అమరవీరుడని అన్నారు. భూమి కోసం, పీడిత ప్రజల హక్కుల సాధన కోసం తన ప్రాణాలను అర్పించిన మహనీయుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు.

దొడ్డి కొమురయ్య త్యాగం, ధైర్యసాహసాలు నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయని కొనియాడారు.ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి  నర్సయ్య, బహుజన సంఘాల నాయకులు కొత్తపల్లి మల్లయ్య,   జిల్లా అధ్యక్షులు మర్కంటి భూమన్న, మర్కంటి బుచ్చన్న, అడ్లూరి ఎల్లారెడ్డి బీరయ్య, శ్రీనివాస్, కాలభైరవ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ చింతల శంకర్, జిల్లా అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, బహుజన సంఘాల ప్రతినిధులు , ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.