SIR కార్యక్రమంలో బీఎల్ఎల పాత్ర కీలకం
బోథ్,జులై 4(విజయక్రాంతి):ప్రభుత్వం చేపట్టిన ఎస్ ఐ ఆర్ కార్యక్రమంలో బిఎల్ఈ ల పాత్ర కీలకమని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతు వేదికలు బిఎల్ఎ లు సూపర్వైజర్లతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి బూతులో పార్టీ బలోపేతానికి బిఎల్ఎ లు కీలక పనిచేయాలని సూచించారు.
ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని పేర్కొన్నారు కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ జి రాజు యాదవ్ తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహేందర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బద్దం పోతారెడ్డి ఆదిలాబాద్ జిల్లా స్పోక్స్ పర్సన్ పసుల చంటి బి ఎల్ ఎ టు సూపర్వైజర్లు షేక్ మహమ్మద్ పొన్నాల శమిందర్ శ్రీనివాస్ అంజయ్య దశరథ్ మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మెరుగు నరసింహ దాస్ వినయ్ రెడ్డి అరుణ్ కుమార్ నక్కలవాడ సర్పంచ్ నవీన్ లతోపాటు పలు గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు






