02-12-2025 05:31:53 PM
యువకునికి పట్టం కట్టిన గ్రామస్తులు..
రేగొండ (విజయక్రాంతి): కొత్తపల్లి గోరి మండలంలోని నూతన గ్రామ పంచాయతీ బాలయ్య పల్లి ఏకగ్రీవం అయింది. ఆ గ్రామ మొట్టమొదటి సర్పంచ్ గా యువకుడు తొట్ల తిరుపతి యాదవ్ ను ఏకగ్రీవంగా ఆ గ్రామ ప్రజలు ఎన్నుకున్నారు. దీంతో మంగళవారం సర్పంచ్ తిరుపతి భూపాలపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావును కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు తొట్ల కుమార్ యాదవ్, ముఖ్య నాయకులు తొట్ల రవీందర్ యాదవ్, వంగ కుమారస్వామి యాదవ్ లతో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తిరుపతి యాదవ్ కు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సహకారంతో బాలయ్యపల్లి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని సర్పంచ్ తిరుపతి యాదవ్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలను గ్రామంలోని ప్రతి కుటుంబానికి అందేలా చేస్తానని అన్నారు. సేవాభావం కలిగిన యువకుడు బాలయ్యపల్లి గ్రామానికి మొట్టమొదటి సర్పంచ్ గా తిరుపతి యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.