02-12-2025 05:27:49 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): బెల్లంపల్లి శాంతిఖనిలో మంగళవారం ఏఐటీయూసీ నాయకులు గనిలోకి దిగారు. ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రెటరీ దాగం మల్లేష్ నాయకత్వంలో లీడర్ల బృందం గని పరిస్థితిని పరిశీలించింది. శాంతిగనిలో గత 25 రోజులుగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో అందుకు గల కారణాలు, మైన్ యొక్క సేఫ్టీ, ప్రొడక్షన్ ఎలా ఉందో తెలుసుకోవడం కోసం నాయకులు గనిలోకి దిగారు. గనిని సందర్శించిన వారిలో శాంతిగని మైన్ ఫిట్ సెక్రెటరీ దాసరి తిరుపతి గౌడ్, బెల్లంపల్లి బ్రాంచ్ ఉపాధ్యక్షులు బియ్యాల వెంకటస్వామి, కాశీపేట-2 పిట్ సెక్రటరీ శ్రీనివాస్, బ్రాంచ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మంతెన రమేష్, వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ పొట్ల రాయలింగు, మైన్స్ కమిటీ సభ్యుడు దాడి రమేష్ ఉన్నారు.