17 April, 2026 | 3:12 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

జూలై 1న బల్కంపేట బోనాలు

25-06-2025 12:07 AM
  1. ఆలయాల్లో పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రులు 

వైభవంగా నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు

హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): జూన్ 26న మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ గోల్కొండ శ్రీ జగదాంబ మహాంకాళి ఆలయంలో జూలై 1న బల్కంపేట శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానంలో పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. జంట నగరాల్లో నిర్వహించే బోనాల ఉత్సవాలకు రాష్ట్ర మంత్రులు, ముఖ్య నేతలు వివిధ ఆలయాల్లో పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని ప్రభు త్వం తెలిపింది.

సికింద్రాబాద్, జూలై 13న శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జూలై 20న లాల్‌దర్వాజ శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శ్రీ మహంకాళి సహిత మహాకాళేశ్వర స్వామి దేవస్థానంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీ దర్బార్ మైసమ్మ ఆలయంలో మంత్రి దామోదర రాజనర్సింహ శ్రీ భాగ్యలక్ష్మి ఆలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీ అక్కన్న మాదన్న ఆలయంలో దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శ్రీ కట్టమైసమ్మ ఆలయంలో పొంగులేటి శ్రీనివా స్ రెడ్డి,

శ్రీ నల్ల పోచమ్మ ఆలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, శ్రీ చ్ మైసమ్మ ఆలయంలో మంత్రి సీతక్క , శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో మంత్రి వివేక్, శ్రీ మహాంకాళి ఆలయం మంత్రి వాకిటి శ్రీహారి, జగదాంబ ఆలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఉప్పుగూడ శ్రీమహాంకాళి ఆలయంలో శాస నమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఇందుకోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. తెలంగాణ సాంప్రదాయమైన బోనాల పండుగ నిర్వహణలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూడాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది.