calender_icon.png 12 February, 2026 | 4:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టేటస్‌లో బ్యాలెట్ పేపర్

12-02-2026 02:41:55 AM

  1. బెల్లంపల్లి 19 వార్డు మాజీ కౌన్సిలర్ నిర్వాకం
  2. కాంగ్రెస్ రెబల్‌గా ఆ వార్డు బరిలో తల్లి 

బెల్లంపల్లి, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల్లో ఓ మాజీ కౌన్సిలర్ ఓటు వేసి, ఆ బ్యాలెట్ పేపర్‌ను వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకోవడం కలకలం రేపింది. బెల్లంపల్లి బస్తీలోని 19 వార్డు నుంచి కాంగ్రెస్ రెబల్‌గా పోటీలో ఉన్న కౌన్సిలర్ అభ్యర్థి కొమ్ముల జయ తనయుడు, మాజీ కౌన్సిలర్ కొమ్ముల సురేష్ 32వ పోలింగ్ బూత్‌లో ఓటు ఓటు వేశారు. ఓటు వేసిన బ్యాలెట్ పేపర్‌ను ఫోటో తీసుకొని స్టేటస్ పెట్టుకున్నాడు.

ఆ విషయం తెలిసిన ఎన్నికల అధికారులు ఖంగుతిన్నారు. పోలింగ్ బూత్‌లోకి ఆయన సెల్‌ఫోన్‌తో ఎలా వెళ్లడాని చర్చ జరుగుతున్నది. పోలింగ్ బూత్ అధికారులు, పోలీసుల తనిఖీల వైఫల్యం వల్లనే ఈ సంఘటన చోటుచేసుకుందని తెలుస్తోంది. ఈ ఘటనపై ఎన్నికల ఉన్నతాధికారులు, పోలీసులు విచారణ చేపట్టారు. అత్యుత్సాహంతో ఓ మాజీ కౌన్సిలర్ కొమ్ముల సురేష్ నిర్వాకంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.