12-02-2026 02:41:25 AM
ఓటుహక్కువినియోగించుకున్న టీఎస్‌పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
నిజామాబాద్, ఫిబ్రవరి11 (విజయ క్రాంతి): నిజామాబాద్ బల్దియా పై ఎగిరేది కాంగ్రెస్ కాంగ్రెస్ జెండా నే అని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ నగరం లోని సన్ ఫ్లవర్ హైస్కూల్లో తెలంగాణ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ బుధవారం తన ఓటుహక్కును వినియోగించుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని తమ పార్టీ కార్యకర్తలు పటిష్టంగా పనిచేశారని ప్రజల ఆదరణ తమ వైపే ఉందని తప్పకుండా బల్దియా బాద్షా కాంగ్రెస్ చైర్మన్ అన్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును తన సొంత తన సొంత ఊరిలోవినియోగించు కోవడం గర్వంగా ఉందన్నారు.
రాజ్యాంగం కల్పించిన వరం ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన వరమని అందరూ కచ్చితంగా ఓటు హక్కు వినియోగించి బాధ్యతగల భారత పౌరులుగా నిలవాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. అని పేర్కొంటూ, ప్రతి ఒక్కరు తప్పకుండా ఓటు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటింగ్ శాతం పెరిగితే ప్రజలకు సేవ చేసే, క్వాలిటీ ఉన్న నాయకులు ఎన్నికవుతారని తెలిపారు. నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడే గెలవాలని తన ఆకాంక్ష అని చెప్పారు. నిజామాబాద్ ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.