2 May, 2026 | 3:34 AM

ఏకో పార్క్ కు వ్యతిరేకంగా బండ రావిరాల గ్రామ సభ తీర్మానం

02-05-2026 02:20 AM

సర్పంచ్ కందికంటి విజయ్ కుమార్ అధ్యక్షతన సమావేశం

అబ్దుల్లాపూర్ మెట్, మే 1: ఏకో పార్క్(డంపింగ్ యార్డ్) కు వ్యతిరేకంగా  బండ రావిరాల  గ్రామసభ ఏకగ్రీవ నిర్మాణం చేసింది.  సర్పంచ్ కందికంటి విజయ్ కుమార్ అధ్యక్షతన అత్యవసర  సమావేశం నిర్వహించారు. గ్రామ రెవెన్యూ పరిధి సర్వేనెంబర్  268లో 494 ఎకరాలలో  ఏకో పార్క్ (డంపింగ్ యార్డ్)ను ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఏకో పార్క్(డంపింగ్ యార్డ్) కు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరం పోరాడాలని పిలుపునిచ్చారు. 

ఈ ప్రాజెక్ట్ వల్ల గ్రామ ప్రజలకు కలిగే ఇబ్బందులను వివరించినట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధికి అడ్డుపడే ఏ నిర్ణయాన్నైనా పార్టీలకు అతీతంగా మనమంతా కలిసి వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఏకో పార్క్(డంపింగ్ యార్డు)  ప్రతిపాదనకు వ్యతిరేకంగా గ్రామసభ లో  ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు తెలిపారు.

ప్రభుత్వం ఏకో పార్క్ ఏర్పాటు తక్షణమే విరమించుకోకపోతే ఎలాంటి పోరాటానికైనా సిద్ధమేనని గ్రామ ప్రజలు ముక్తకంఠoగా హెచ్చరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దూస శంకర్, వార్డు సభ్యులు నేమురగోముల మహేష్, కోదాస్ మణెమ్మ, కన్నె భరత్,ఎడవెల్లి సుష్మిత రమేష్, ఏర్పుల హరికృష్ణ, కందికంటి అనూష ప్రవీణ్,  కొత్త అరుణ్ కుమార్,కంది కంటి నర్సింగ్ రావు, గ్రామ నాయకులు మొలుగు అర్జున్,  గుండ్ల సతీష్, గ్రామ ప్రజలు ,యువజన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.