ఎర్రుపాలెంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేసిన బండారు నరసింహారావు
ఎర్రుపాలెం,(విజయక్రాంతి): ఎర్రుపాలెం మండల కేంద్రంలో రైతు వేదిక నందు శుక్రవారం మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు స్మార్ట్ రేషన్ కార్డులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై రేషన్ కార్డు లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులను జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి , మండల కాంగ్రెస్ అధ్యక్షులు బొగ్గుల శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
తనంతరం మాట్లాడుతూ బండారు నరసింహారావు తెలంగాణ ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా పేద ప్రజలకు అందిస్తున్న సన్న బియ్యం, ఇతర సరుకులను అందించేందుకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నండ్రు అశ్విని, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఐలూరి వెంకటేశ్వర రెడ్డి, ఎస్.కె శబాష్, షేక్ ఇస్మాయిల్, కే వెంకట నరసయ్య, బి గోవర్ధన రెడ్డి, ముక్కెర రామకృష్ణారెడ్డి ఆర్ ఐ రవికుమార్, ఎర్రుపాలెం డీలర్లు ఎస్.కె ఇమాంస, దారా శ్రీనివాసరావు, రెవెన్యూ సిబ్బంది, రేషన్ కార్డు లబ్ధిదారులు పాల్గొన్నారు.






