24 July, 2026 | 2:41 PM

ఇంటర్, ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం

24-07-2026 02:09 PM

ఆసిఫాబాద్(విజయక్రాంతి): నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై జాతీయ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలో PDSU, NSUI, DYFI ఆధ్వర్యంలో ఇంటర్, ఉన్నత విద్యాసంస్థల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి జగజంపుల తిరుపతి, NSUI నియోజకవర్గ అధ్యక్షుడు జమీర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శించారు. ఈ కార్యక్రమంలో అయ్యుబ్ ఖాన్, గేడం టికానంద్, దుర్గం రాజకుమార్, సమీర్, శివశంకర్, శ్రీకాంత్, ముబారక్ తదితరులు పాల్గొన్నారు.