24 July, 2026 | 3:01 PM

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

24-07-2026 02:31 PM

లక్షేట్టిపేట,(విజయక్రాంతి): బీఆర్ఎస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు శుక్రవారం మంచిర్యాల జిల్లా లక్షేట్టిపెట మండల కేంద్రంలోని ఐబీలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మునిసిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... మాజీ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేశామన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ కోసం, ప్రజా సేవ కోసం కేటీఆర్ ను ఆదర్శంగా తీసుకుని ముందుకువెళ్లాలని పిలుపునిచ్చారు. స్వరాష్ట్ర సాధనలో కల్వకుంట్ల కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. కేటీఆర్ మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.