24 July, 2026 | 3:02 PM

నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి: సర్పంచ్

24-07-2026 02:31 PM

బెజ్జూర్ జూలై 24 (విజయక్రాంతి): బెజ్జూర్ గ్రామ పంచాయతీలో వన మహోత్సవం కార్యక్రమం లో భాగంగా సర్పంచ్ దుర్గం సరోజ-తిరుపతి,ఉప సర్పంచ్ రాచకొండ ఆదర్శ్,పాలక వర్గ సభ్యుల ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.సర్పంచ్ దుర్గం సరోజ-తిరుపతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించే బాధ్యతలను స్వీకరించాలని గ్రామంలో పచ్చదనం పెంచి పకృతిని కాపాడాలని వివరించారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి మీసారి వైకుంఠం, పాలక వర్గ సభ్యులు,ఆశ కార్యకర్త వైశాలి తదితరులు పాల్గొన్నారు.