24 July, 2026 | 3:09 PM

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

24-07-2026 02:07 PM

మూడుసార్లు కోర్టు ఆదేశాలు ఉల్లంఘించడం కోర్టు చరిత్రలో లేదు

హైదరాబాద్: లోతుకుంట(Lothukunta) భూములపై తెలంగాణ హైకోర్టులో(Telangana High Court) మరోసారి విచారణ జరిగింది. హైడ్రా తరుఫున ఏజీ సుదర్శన్ రెడ్డి(AG Sudarshan Reddy) విచారణకు హాజరయ్యారు. హైడ్రా కమిషనర్ పైమరోసారి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రెవెన్యూ, నీటిపారుదల చట్టాలు కాకుండా హైడ్రా చట్టమొక్కటే ఉందా? అని ప్రశ్నించింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం హైడ్రాకు అలవాటుగా మారిందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకే భూమి విషయంలో 3 ధిక్కారణ పిటిషన్లు వచ్చాయని హైకోర్టు సూచించింది.

మూడుసార్లు కోర్టు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం కోర్టు చరిత్రలో లేదని కోర్టు హైడ్రా కమిషనర్((HYDRA Commissioner)కు చురకలంటించింది. కోర్టు ధిక్కారణ ఉత్తర్వుల్లో అప్పీల్ చేయకుండా మళ్లీ భూమిలోకి వెళ్లడం తీవ్రనేరమని హైకోర్టు పేర్కొంది. పూర్తి స్థాయి అఫిడవిట్ దాఖలుకు సమయం కావాలని ఏజీ ధర్మాసనాన్ని కోరారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్(HYDRA Commissioner Ranganath) క్షమాలణలతో అఫిడవిట్ దాఖలు చేయాలన్న హైకోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. హైకోర్టు శాంతాశ్రీరామ్ భూమిలో ఆర్మీ రక్షణ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది.