18-10-2025 05:12:14 PM
మునిపల్లి (విజయక్రాంతి): బీసీలకు 42 శాతం అమలు కోసం శనివారం నాడు ఆయా పార్టీలకు చెందిన బీసీ నేతలంతా నిర్వహించిన బంద్ ప్రశాంతంగా ముగియడంతో పాటు సక్సెస్ అయ్యింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆదేశాల మేరకు మునిపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మంతూరి శశి కుమార్ అధ్యక్షతన మండల పరిధిలోని బుదేరా చౌరస్తాలో ముంబాయి జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మునిపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మంతూరి శశి కుమార్, మండల సీనియర్ నాయకులు కుతుబుద్దిన్, బండారి పాండు, పెద్ద గోపులారం బాగన్న, సుల్తాన్ గొర్రె గట్టు విఠల్, రాజేందర్, ఆంజనేయులు, బుదేరా చిన్న, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.