నేపాల్‌లో భూకంపం
27-02-2026 12:08 PM
ఖాట్మండు: నేపాల్‌లోని శంఖువసభ జిల్లాలో శుక్రవారం 4.7 తీవ్రతతో భూకంపం(Earthquake) సంభవించింది. భూకంపం కారణంగా ప్రాణ నష్టం లేదా ఎలాంటి నష్టం జరిగినట్లు తక్షణ నివేదికలు రాలేదని అధికారులు ప్రకటించారు. శుక్రవారం తెల్లవారుజామున 3.18 గంటలకు భూకంపం సంభవించిందని, దీని కేంద్రం ఖాట్మండుకు తూర్పున 400 కి.మీ దూరంలో ఉన్న సంఖువాసభ-తప్లేజంగ్ సరిహద్దు ప్రాంతానికి సమీపంలో ఉన్న తోప్కే గోలా వద్ద ఉందని జాతీయ భూకంప పర్యవేక్షణ, పరిశోధన కేంద్రం (National Earthquake Monitoring and Research Centre) తెలిపింది. భూకంపం రావాడంతో ప్రజలు భయాందోళనలతో పరుగులుపెట్టారు.




