calender_icon.png 18 October, 2025 | 8:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాలికుంటు టీకాలు తప్పనిసరిగా వేయించాలి

18-10-2025 05:09:42 PM

జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి అసోడ కుమారస్వామి..

చిట్యాల: పశువులకు గాలికుంటు టీకాలు తప్పనిసరిగా వేయించాలని, అందువల్ల పశువులకు ఏలాంటి వ్యాధులు సోకవని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి అసోడ కుమారస్వామి అన్నారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని జడలపేట, జూకల్ గ్రామాలలో నిర్వహిస్తున్న ఉచిత గాలికుంటు టీకాల కార్యక్రమాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మూడు గ్రామాలలో కలిపి 413 పశువులకు గాలి కుంటు టీకాలు వేయడం జరిగిందని పేర్కొన్నారు.

అక్టోబర్ 15 నుంచి నవంబర్ 14 వరకు మండలంలోని అన్ని గ్రామాలలో గాలికుంటు టీకాలు ఉచితంగా వేయడం జరుగుతుందని తెలిపారు. కావున రైతులు సద్వినియోగం చేసుకొని పశువుల ఆరోగ్యాన్ని కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పశు వైద్య అధికారి డాక్టర్ అజయ్ అప్పని, అసిస్టెంట్ డైరెక్టర్ లు గోపాల కృష్ణమూర్తి, వెంకన్న, లైవ్ స్టాక్ అసిస్టెంట్స్ కవిత,దివ్య, సహాయ సిబ్బంది కరుణాకర్, సుజాత, రాజేందర్, గోపాలమిత్ర లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.