27 February, 2026 | 10:55 AM

నాయనమ్మకు తలకొరివి పెట్టిన మనవరాలు

18-10-2025 05:15 PM

టేకులపల్లి (విజయక్రాంతి): నాయనమ్మకు తలకొరివి పెట్టిన మనవరాలు.. ఈ సంఘటన టేకులపల్లి మండలం బోడు గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే బోడు గ్రామానికి చెందిన అడపా వీరమ్మ అనే మహిళా అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందింది. ఆమె భర్త మంగయ్య కొన్నేళ్ల క్రితమే మృతి చెందారు. వారికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు చంద్రశేఖర్ నాలుగేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శనివారం వీరమ్మ అంత్యక్రియలు బోడులో నిర్వహించారు. తలకొరివి పెట్టేందుకు ఉన్న ఒక్క కుమారుడు మృతి చెందడంతో ఎనిమిదేళ్ల మనవరాలు నరసింహ ప్రియా తన తల్లి మల్లిక వెంట ఉండగా, నాయనమ్మకు తలకొరివి పెట్టింది. చిన్న వయస్సులో పెద్ద భారం మోయడం చూసి అక్కడికి వచ్చిన వారంతా కన్నీరు పెట్టుకున్నారు.