24 August, 2026 | 11:40 AM

Breaking News

కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం   •   మంత్రి కొండా సురేఖ వివాదానికి సీఎం రేవంత్ చెక్ పెడతారా?   •   గోడ దూకిన ఇంటర్ విద్యార్థులు   •   భవనం కూలిన ఘటనలో బిల్డర్‌ సయ్యద్‌ సజీద్‌ అరెస్ట్   •   సోయం ముందస్తు వ్యూహం.. అధిష్టానం ఆదేశాలతో పల్లెబాట   •   నిశ్చితార్థం రోజే విషాదం.. కారు ప్రమాదంలో యువకుడు మృతి   •   వర్షాలు కురుస్తలేవని కుళ్ళిన శవాన్ని తీసి మళ్ళీ ఖననం.!   •   కొండా సురేఖ మాజీ ఓఎస్డీ కేసులో మరో ముగ్గురి అరెస్ట్   •   మొక్కును చెల్లించుకున్న దంపతులు.. శ్రీ సీతారామచంద్ర స్వామికి వెండి కానుకలు   •   హైదరాబాద్‌ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి   •  

జ్యోతినగర్ శ్రీవేంకటేశ్వర బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న బండి సంజయ్ దంపతులు

21-06-2025 02:01 AM

కరీంనగర్ క్రైం, జూన్20(విజయక్రాంతి):కరీంనగర్ జ్యోతినగర్ లోని శ్రీమహాలక్ష్మీ గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న స్వామివారి పంచమ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్  వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు.

సతీసమేతంగా స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నా రు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య పూజారులు బండి సంజయ్ దంపతులకు ఆశీర్వచనం అందించారు. స్థానిక కార్పొరేటర్ బండి రమణారెడ్డి, మాజీ కార్పొరేటర్ వేదం తోపాటు పలువురు బీజేపీ నాయకులు ఈ బ్రహ్మోత్సవాల్లోపాల్గొన్నారు.