24 August, 2026 | 11:45 AM

Breaking News

అమెరికాలో దమ్మాయీగూడ యువకుడి విషాదాంతం   •   కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం   •   మంత్రి కొండా సురేఖ వివాదానికి సీఎం రేవంత్ చెక్ పెడతారా?   •   గోడ దూకిన ఇంటర్ విద్యార్థులు   •   భవనం కూలిన ఘటనలో బిల్డర్‌ సయ్యద్‌ సజీద్‌ అరెస్ట్   •   సోయం ముందస్తు వ్యూహం.. అధిష్టానం ఆదేశాలతో పల్లెబాట   •   నిశ్చితార్థం రోజే విషాదం.. కారు ప్రమాదంలో యువకుడు మృతి   •   వర్షాలు కురుస్తలేవని కుళ్ళిన శవాన్ని తీసి మళ్ళీ ఖననం.!   •   కొండా సురేఖ మాజీ ఓఎస్డీ కేసులో మరో ముగ్గురి అరెస్ట్   •   మొక్కును చెల్లించుకున్న దంపతులు.. శ్రీ సీతారామచంద్ర స్వామికి వెండి కానుకలు   •  

ఉద్యోగుల సంక్షేమమే ప్రధానం

21-06-2025 02:00 AM
  1. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  2. ట్రాన్స్‌కోలో కారుణ్య నియామకపత్రాలు అందజేత

హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): విద్యుత్ శాఖ సిబ్బంది సంక్షేమమే ప్రజా ప్రభుత్వ విధానమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. శుక్రవారం ప్రజాభవన్‌లో ట్రాన్స్‌కోలోని 18 మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. వారిలో ఏడుగురు రెగ్యులర్ కాగా, 11 మంది ఆర్టిజెన్స్ ఉన్నారు. విధుల్లో ప్రాణాలు కోల్పోయిన ట్రాన్స్‌కో ఉద్యోగులతోపాటు ఆర్టిజెన్స్ కూడా కారుణ్య నియామకాల్లో అవకాశాలు కల్పిస్తున్నామని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క తెలిపారు.

ఆర్టిజెన్స్‌ను కూడా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ప్రభుత్వం భావిస్తుందని పేర్కొన్నారు. కారుణ్య నియామక పత్రాలు పొందిన  ఉద్యోగులు సంస్థ అభ్యున్నతికి తోడ్పడాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, డైరెక్టర్లు సూర్యప్రకాశ్, బీ నర్సింగరావు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.