8 July, 2026 | 3:34 AM

భవానీ దీక్ష స్వీకరించిన బండి సంజయ్

30-09-2024 02:35 PM

కరీంనగర్, (విజయక్రాంతి): శ్రీ దేవీ నవరాత్రి పర్వదినాలను పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సోమవారం మహాశక్తి ఆలయంలో భవానీ దీక్షను స్వీకరించారు. బండి సంజయ్ తోపాటు వందలాది మంది భక్తులు భవానీ దీక్షను స్వీకరించారు.