4 July, 2026 | 8:41 PM

Breaking News

లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •   బోధన్ మున్సిపల్ కమిషనర్ హోటళ్లు, బేకరీల్లో ఆకస్మిక తనిఖీలు   •   కొత్తదనం ఎప్పుడూ ఉత్సాహాన్ని అందిస్తుంది   •   ప్రజల మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి   •   డాక్టర్ ఏవి గిరిసింహా రావు కరీంనగర్ నుండి ఖమ్మం బదిలీ   •   ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తారీకు జీతాలు   •   సీఎంపీఎఫ్ బోర్డు సమావేశంలో కార్మికుల సమస్యలపై ప్రశ్నించిన బీఎంఎస్   •   కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రేవంత్‌కు పాలాభిషేకం   •   కొలువుదీరిన కొత్త పాలకవర్గాలు   •   రైతు భరోసా నిధులు విడుదల పట్ల కాంగ్రెస్ నాయకుల సంబరాలు   •  

దేశ ప్రధానిగా ఓబీసీ నేతను చేసింది బేజేపీనే

30-08-2024 12:38 PM

హైదరాబాద్: బీజేపీ నాగోల్ లో నిర్వహించిన వర్క్ షాప్ కు కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ హాజరయ్యారు. గత ప్రభుత్వంలో 12 మంది ఎస్సీలను కేంద్రమంత్రులను చేసింది బీజేపీ అన్నారు. సభ్యత్వ నమోదు సమయంలో ఎస్సీ మోర్చా సభ్యత్వాల నమోదు చేయించాలని బండి సంజయ్ సూచించారు. దేశ ప్రధానిగా ఓబీసీ నేతను చేసింది బీజేపీనేనని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి బీజేపీ చేసిన పనులు చెప్పి సభ్యత్వ నమోదు చేయించాలని తెలిపారు. ప్రధాని మోడీ ప్రభుత్వం ఒక లక్ష్యంతో పనిచేస్తోందన్నారు. 370 ఆర్టికల్ రద్దు చేసిన గొప్పనేత  ప్రధాని మోడీ అని బండి సంజయ్ కొనియాడారు. బీజేపీ కార్యకర్తలు సిద్ధాంతంతో పనిచేస్తున్నారని కేంద్రమంత్రి వెల్లడించారు. ప్రతి కార్యకర్త త్యాగాన్ని బీజేపీ గుర్తు చేసుకుంటుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ.. ఆ పార్టీ కార్యకర్తల గురించి మాట్లాడదని బండిసంజయ్ ఆరోపించారు.