సలేశ్వరం జాతరకు పోటెత్తిన భక్తులు
నేటితో ముగియనున్న యాత్ర
నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లాలో కొనసాగుతున్న సలేశ్వరం జాతరకు భక్తజనం అశేషంగా తరలివచ్చారు. బుధ, గురు, శుక్ర వారాలు మూడు రోజుల మీటింగ్ జరిగే ది ఇప్పటికే లక్షల్లో భక్తులు లింగమయ్యను దర్శించుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. గురువారం కల్వకుర్తి, నాగర్ కర్నూల్, అచ్చంపేట కొల్లాపూర్ ప్రాంతాల నుంచి అధికారులు ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సుల్లో కిక్కిరిసి సలేశ్వరం వైపు అడుగులు వేస్తున్నారు. మన్ననూర్, నుండి వాహనాల రద్దీ భారీగా పెరగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
అమర్నాథ్ యాత్రను తలపించేలా పెద్ద పెద్ద రాళ్లు గుట్టలు ఎక్కేస్తూ ట్రెక్కింగ్ మాదిరి చిన్నా పెద్ద తేడా లేకుండా కర్రల సాయంతో యాత్ర సాగించారు. ఒకేరోజు లక్షల మంది భక్తులు వచ్చి చేరడంతో అటవీ, పోలీస్ శాఖ అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్రోన్ సహాయంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపుతూ అధికారులను, భక్తులను అప్రమత్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్, జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్, జిల్లా ఫారెస్ట్ అధికారి రేవంత్ చంద్ర అర్ధరాత్రి వరకు అక్కడే ఉండి పరిశీలించారు. శుక్రవారం సాయంత్రం ౭ గంటలకు ముగిస్తున్న ట్లు అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు.




