7 April, 2026 | 4:36 AM

బండి సంజయ్ మీ వైఖరేంటి?

07-04-2026 03:02 AM
  1. నియోజకవర్గాల పునర్విభజన దక్షిణాదికి అన్యాయం 

ప్రభుత్వ విప్ వేమల వీరేశం 

హైదరాబాద్, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపైన కేంద్ర మంత్రి బండి సంజయ్ అసత్య ప్రచారం చేస్తున్నారని, కానీ నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాదికి జరిగే అన్యాయం తన వైఖరిని స్పష్టం చేయడం లేదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం మండిపడ్డారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగుతుందని ఆధారాలతో సహా  సీఎం రేవంత్‌రెడ్డి  చెబుతుంటే..

దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనీయమని కేంద్రమంత్రిగా ఉన్న బండి సంజ య్ ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ దేశం పట్ట ఆయన ఒక్కరికే భక్తి ఉన్నట్లుగా మాట్లాడటం సరికాదని వేముల వీరేశం సోమవా రం  ఒక ప్రకటనలో పేర్కొన్నారు.