మహబూబ్ నగర్ డీసీసీ ప్రెసిడెంట్ కి బంగ్లా రవీందర్ రెడ్డి అప్లికేషన్
17-10-2025 11:23 PM
నవాబ్ పేట్,(విజయక్రాంతి): ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని డిసిసి ప్రెసిడెంట్లను నియమించాలని ప్రకటించారు.అందులో భాగంగా శుక్రవారం జడ్చర్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా డిసిసి ప్రెసిడెంట్ గా బంగ్లా రవీందర్ రెడ్డి తన యొక్క అప్లికేషన్ ను అందజేశారు. ఈ సందర్భంగా బంగ్లా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎంతోకాలంగా కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పని చేసిన నాయకులకే పదవుల దక్కేలా పేర్లను పరిశీలిస్తారని వెల్లడించారు. తన యొక్క అప్లికేషన్ ను అధిష్టానం పరిశీలించి న్యాయం చేకూరుస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.






