అసైన్డ్ భూముల్లో అక్రమాల తొలగింపు
ఆక్రమణలపై మున్సిపల్ రెవెన్యూ శాఖ అధికారుల కొరడా
కోట్ల విలువ చేస్తే ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు
నిర్మల్ అక్టోబర్ 16 (విజయ క్రాంతి) : జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల ఆవరించి ఉన్న ప్రభుత్వ భూములు ఆక్రమించు కుంది నిర్మాణాలు చేపట్టగా శుక్రవారం రెవిన్యూ మున్సిపల్ శాఖ అధికారులు వాటిని కూల్చివేశారు. జిల్లా కేంద్రంలోని దివ్య నగర్ అయ్యప్ప హరిహర క్షేత్రం దివ్య గార్డెన్ మెడికల్ కళాశాల ఆనుకుని ఉన్న సర్వేనెంబర్ 534 లోని సుమారు ఐదు ఎకరాల భూమిని నిర్మల్ పట్టణంలో చెందిన ఒక రాజకీయ నేత ఆక్రమించుకున్నట్టు ఫిర్యాదులు రావడంతో అధికారులు ఈ చర్యలకు తీసుకున్నారు.
ప్రభుత్వ అసైన్మెంట్ భూములను మొదటగా పార్కింగ్ స్థలంగా ఏర్పాటు చేసుకున్న ఓ నేత ఆ తర్వాత చు ట్టూ ప్రహరీ గోడ ఇతర వెంచర్లు ఏర్పాటు చేయడంతో ఇటీవలే కొందరు నిర్మల్ ఎమ్మె ల్యే మహేశ్వర్ రెడ్డి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. పట్టణంలో ఆనుకొని ఉన్న ఈ స్థలం కోట్ల రూపాయల విలువ చేసే స్థలం కావడంతో దీనిపై విచారణ జరిపిన అధికారులు అది ప్రభుత్వ అసెస్మెంట్ భూమిగా గుర్తించి శుక్రవారం రెవెన్యూ మున్సిపల్ శాఖ అధికారు లు అక్రమాలను తొలగించారు.
జెసిబిల సాయంతో ప్రహరీ గోడను కూల్చివేసి స్థలంలో ఏర్పాటుచేసిన సిమెంటు ఇటుక దిమ్మలను తొలగించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సదరు నేత అక్కడికి చేరుకొని అధికారులతో భూమి విషయంలో మాట్లాడినప్పటికీ దానికి సంబంధించిన రికార్డు లేవుకపోవడంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్టు నిర్బల్ అర్బన్ తాసిల్దార్ రాజు తెలిపారు. ఆక్రమించుకున్న భూమి ప్రభు త్వం సాధన చేసుకొని చుట్టూ కంచ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.






