రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
తుంగతుర్తి మార్కెట్ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి
తుంగతుర్తి, అక్టోబర్ 17 ః రైతు సంక్షేమం దిశగా సీఎం రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతుందని తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని సింగారం తండా, కేశవాపురం, వేలుగు పల్లి, తుంగతుర్తి, సొసైటీ, దేవుని గుట్ట తండా, వెంపటి, గొట్టిపర్తి, దేవుని గుట్ట తండా, మంచ తండా, బండ రామారం గ్రామాల్లో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసిల్దార్ దయానందం, ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు,వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న అధికారులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడు తూ.. చివరి వరి గింజ వరకు వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులెవ్వరు ఆందోళన చెండకూడదన్నారు.రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి గిట్టుబాటు ధర పొందాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు తీసుకువచ్చేటప్పుడు 17% తేమ వచ్చే విధంగా ఆరబెట్టుకుని కొనుగోలు కేంద్రాలకు తాలు, మట్టి పేల్లలు లేకుండా నాణ్యతతో కూడిన ధాన్యాన్ని తీసుకురావాలని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అందించే ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2389, బి గ్రేడ్ ధాన్యానికి రూ.2369 మద్దతు ధర తో పాటు సన్న రకానికి రూ.500 రూపాయల బోనస్ అందజేస్తున్నట్లు తెలిపారు. రైతులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఏపీఎం అశోక్, సీసీ రామయ్య, ఏఇవో లు జోత్స్న, హిమబిందు మాజీ ఎంపిటిసి లు కేతిరెడ్డి లత విజయ్ కుమార్ రెడ్డి,సోమ్ల నాయక్, మార్కెట్ డైరెక్టర్ సగ్గం నర్సయ్య, సొసైటీ సీఈవో యాదగిరి , సొసైటీ డైరెక్టర్లు, ఆయా గ్రామాల ఐకెపి నిర్వాహకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.






