05-07-2025 12:03:47 AM
మాజీ ఎంపీ రవీందర్ నాయక్
ముషీరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): బంజారా మహావీరుడు, గొప్ప చక్రవర్తి లక్కీషా బంజారా గొప్పతనం దేశ వ్యాప్తంగా తెలియాల్సిన అవసరం ఉందని మాజీ ఎంపీ రవీందర్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ మేరకు శుక్రవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో గిరిజన శక్తి, భారత్ గోర్ బంజారా సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో బంజారా మహావీరుడు, గొప్ప చక్ర వర్తి 16 వ శతాబ్దంలో దక్షిణ ఆసియాలోనే అతి పెద్ద పారిశ్రామికవేత్త, ఢిల్లీలో అద్భుతమైన ఆర్కిటెక్ట్ నిర్మాణం చేసిన చక్రవర్తి లక్కీషా బంజారా 445 వ జయంతి వేడుకలను గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వెంకటేష్ చౌహన్, గిరిజన జేఏసీ చైర్మన్ రాజేష్ నాయక్ సభ అధ్యక్షతన నిర్వహించారు.
ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ రవీందర్ నాయక్, భారత్ గోర్ బంజారా సేవా సమితి జాతీయ అధ్యక్షులు జగన్ నాయక్ హాజరై మాట్లాడారు. లక్కీషా బంజారా చరిత్రపై పరిశోధన వెంటనే చేపట్టాలన్నారు. ఆయన విగ్రహాన్ని నగరంలో ఏర్పాటు చేయాలన్నారు.
తెలంగాణలో ఒక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి ఆయన చరిత్రపై ఒక మ్యూజియం ఏర్పాటు చేసి బంజారా వీరుల చరిత్రను బయటకు తేవాలని ప్రభుత్వాన్ని కోరారు. ధనంజయ్ నాయక్, హరిచ రణ్, రాకేష్ నాయక్, జె.డి నాయక్, కార్తీక్ నాయక్, శ్రీమాన్ నాయక్, చిరంజీవి నాయ క్, స్వామి నాయక్, సైదా నాయక్, కుమార్, హనుమా నాయక్, అభయ్ పాల్గొన్నారు.