05-07-2025 12:04:57 AM
సీజనల్ వైద్యులపై అప్రమత్తంగా ఉండాలి
జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
ఏటూరునాగారం,(విజయక్రాంతి): మెరుగైన వైద్య సేవలు అందించాలని, సీజనల్ వైద్యులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. శుక్రవారం ఏటూరునాగారం కమ్యూనిటీ హెల్త్ సెంటరును జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అకస్మిక తనిఖీ చేసి హాస్పిటల్లోని క్యాజువల్టీ, పిఎన్సి, డెంగు వార్డులను పరిశీలించి, రోగుల యొక్క ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, అందుతున్న వైద్య సేవలు తీరును అలాగే మెనూ ప్రకారంగా అందజేస్తున్న భోజన సౌకర్యాన్ని రోగులను మొదలగు విషయాలను రోగులను అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్కు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆస్పటల్ సూపరిండెంట్ సురేష్ కు తెలిపారు. అలాగే హాస్పిటల్ బిల్డింగును పరిశీలించి కారిడార్లో లీకవుతున్న నీటి తిరును కూడా అడిగి తెలుసుకున్నారు.