29 July, 2026 | 9:38 PM

Breaking News

మంథని మాజీ ఉపసర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   తెలంగాణ జలసిరిపై ప్రజలకు అవగాహన కల్పించిన పెద్దకాపర్తి సర్పంచ్   •   నల్లబండగూడెం సాయిమందిరంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు   •   గురుపౌర్ణమి సందర్భంగా సామూహిక ధ్యానం   •   ఆర్మూర్ ఎంఈవోగా రాజేశ్వర్   •   ఏజెన్సీలో భారీ వర్షాలు.. గిరిజన గ్రామాలకు రాకపోకలు బంద్   •   భిక్కనూర్ పీహెచ్‌సీలో వైద్య సేవలపై డైరెక్టర్ ఆకస్మిక తనిఖీ   •   సువర్ణ వనమాల దశదిన కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   రోటర్ డామ్ ఇంటర్నేషనల్ స్కూల్ కు ప్రతిష్టాత్మక ఆర్ఐడిఎస్ అంతర్జాతీయ అవార్డు   •   ఎర్రుపాలెం మండలంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు   •  

బాన్సువాడ ప్రశాంతం

23-02-2026 02:16 AM

సద్దుమణిగిన ఉద్రిక్తత

ఉద్రిక్తతకు కారణమైన వారి అరెస్టు

బాన్సువాడ వెళ్లకుండా బీజేపీ నాయకులను అడ్డుకున్న పోలీసులు

కామారెడ్డి, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కొనసాగిన ఉద్రిక్తత పరిస్థితులు సద్దుమణిగాయి. కానీ పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశా రు. ఉద్రిక్త పరిస్థితులకు కారణమైన వారిని గుర్తించిన పోలీసులు వారిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

అయితే బీజేపీ, ఇతర సంఘాల యువకులపై పోలీసులు అకారణంగా కేసులు నమోదు చేశారంటూ వారిని పరామర్శించేందుకు ఆదివారం బాన్సువాడకు వచ్చేందుకు ప్ర యత్నించిన బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎండల లక్ష్మీనారాయణను పోలీసులు అడ్డుకుని, నిజామాబాద్ పంపించారు. హైదరాబాద్ నుంచి వస్తున్న బీజేపీ నాయకులను సైతం అడ్డుకొని వెనక్కి పంపించారు. రాష్ట్ర నాయకుడు పైడి ఎల్లారెడ్డిని ఎల్లారెడ్డి దాటి న తర్వాత పోలీసులు అడ్డుకుని, వెనక్కి పంపించారు. మాజీ ఎంపీ బీబీ పాటిల్‌ను బుడిమీ వద్ద అడ్డుకున్నారు.