23-08-2025 12:00:00 AM
వనపర్తి టౌన్, ఆగస్టు 22 :: నాలుగు దశాబ్ద కాలంగా వ్యవసాయ పొలంలో ఉన్న భారీ మర్రి వృక్షాలు ఇటీవల కురిసిన కుండపోత వర్షాలక కుంగిపోయి నేల కొరిగాయి. మర్రిచెట్టు ప్రకృతిలో ఎంతో ప్రయోజనాలు కలిగిన చెట్టుగా వృక్ష శాస్త్రం చెబుతుందని శాస్త్రవేత్తలు చెబుతారు. అయితే జిల్లా కేంద్రంలోని కాశీం నగర్ రోడ్డు మార్గం లో ఉన్న వ్యవసాయ పొలంలో చరిత్ర కలిగిన రెండు మర్రిచెట్టు విరిగిపడ్డాయి. చెట్లు విరగడం వల్ల ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. ఇళ్ల మధ్యలో చెట్లు విరిగిపడడం పట్ల కాలనీవాసులు ఆందోళన చెందారని పలువురు తెలిపారు.