calender_icon.png 23 August, 2025 | 10:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిఫెన్స్ మద్యం సీసాలు లభ్యం

23-08-2025 12:00:00 AM

జిల్లా ఎక్సైజ్ అధికారి ఎం సుధాకర్ 

మహబూబ్ నగర్ ఆగస్టు 22 (విజయ క్రాంతి) : డిఫెన్స్ కు సంబంధించిన మద్యం బాటిల్లు లభ్యమైనట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి ఎం సుధాకర్ తెలిపారు. ఈ అక్రమగా విక్రయిస్తున్న మద్యం శిష్యులకు సంబంధించి ఎక్సైజ్ శాఖ అధికారి ఎం సుధాకర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా టాస్క్ ఫోర్స్ టీం మహబూబ్ నగర్ పట్టణం లోని వెంకటేశ్వర కాలనీ వందన విహార్ అపార్ట్ మెంట్ నందు నివాసముంటున్న జి. సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి ఇంటి నందు తనిఖీలు చేయడం జరిగింది.

ఇట్టి తనిఖీలలో వివిధ బ్రాండ్ల కు చెందిన (33) డిఫెన్స్ మధ్యం సీసాలు లభ్యమైనాయి. ఈ మొత్తం మద్యం సీసాల విలువ రూ 90 వేల వరకు ఉంటుం ది. ఇతడు ఇట్టి మద్యం సీసాలను రిటైర్డ్ ఆర్మీ వ్యక్తుల దగ్గర కొంటున్నట్లు విచారణలో తేలింది. సుదర్శన్రెడ్డి వారి దగ్గర కొని మార్కెట్ ధర కన్నా తక్కువ ధరకు వినియోగ దారులకు గుట్టుచప్పుడు కాకుండా సరఫరాచేస్తున్నాడు. ఇతడిపై గత రెండు నెలల నుంచి గట్టి నిఘా ఉంచి పట్టుకోవడం జరిగింది.

అతడు వినియోగిస్తున్న సెల్ ఫోన్ తో పాటు తనిఖీలలో లభ్యమైన 33మద్యం సీసాలలోని 25 లీటర్ల మద్యం ను స్వాధీనం చేసుకొని సుదర్శన్ రెడ్డిపై కేసు నమోదు చేశాం. విచారణ లో త రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులలోని కొందరు తమ వ్యక్తిగత అవసరాలకై ఆర్మీ క్యాంటీన్ లోని మద్యం ను వినియోగించుకోకుండా తమ కోటా లోని మద్యం సీసా లను సుదర్శన్ రెడ్డి లాంటి వ్యక్తుల ద్వారా సాధారణ వినియోగ దారులకు అమ్ము అమ్ముతున్నారని తేలింది.

ఇక ముందు అక్రమంగా మద్యం అమ్మితే ఆర్మీ ఉద్యోగులపై కూడ తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, మహాబూబ్ నగర్ పట్టణం లో కొంత మంది నిర్వహించే పంక్షన్లలో, పార్టీలలో కూడ డిఫెన్స్ మద్యం సరఫరా చేస్తు న్నట్లు విచారణ లో తేలిందన్నారు.

అట్టి సం దర్బాలలో పంక్షన్ హాల్ నిర్వహాకులపై కూ డ కఠిన చర్యలు తీసుకుంటామని, డిఫెన్స్ మద్యం, ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం ఎవరైనా అమ్ము చున్నట్లు అనుమానం వ చ్చిన అట్టి వ్యక్తుల సమాచారమును 87126 58872 నెంబర్ కు తెలిపినచో వారిపై నిషూ ఉంచి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎక్సైజ్ అధికారి యం సుధాకర్ తెలిపారు. తనిఖీలలో పాల్గొన్న టాస్క్ ఫోర్స్ సిఐ కవిత, ఎస్‌ఐ రాజేందర్ సిబ్బందిని ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లా డిప్యూటి కమీషనర్ ఎ విజయ భాస్కర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.