23-08-2025 12:00:00 AM
బీటీపీఎస్ నిర్లక్ష్యంతో ప్రజల ఇక్కట్లు
గ్రామాలను కమ్మేస్తున్న బూడిద
ప్రధాన రహదారి నిండా బూడిద ట్యాంకర్లే
చర్మ, శ్వాస కోస వ్యాధులతో అల్లాడుతున్న జనం
పంటలపైన తీవ్ర ప్రభావం
మణుగూరు, ఆగస్టు 22 ( విజయక్రాంతి) : భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం వెలుగులతో పాటు సమీప గ్రామాలకు వ్య ర్థాలను పంచుతోంది. పొగ ద్వారా వచ్చే వా యు కాలుష్యానికి తోడు బొగ్గుమండించగా మిగిలిన బూడిద ప్రజలను కమ్మేస్తుంది. ప్ర జల తో పాటు పశువులు సైతం అనారోగ్యానికి గుర వుతున్నాయి. పల్లెల నుండి పచ్చని చెట్ల వరకుబూడిద కమ్మేయడంతో ఎండి పోతున్నాయి.
పంటలు సైతం వేయలే కపోతున్నా మని రైతులు గగ్గోలు పెడుతున్నారు. గ్రీన్ బెల్టు ఏర్పాటు, రక్షణ చర్యలు చేపట్టాల్సిన అధికారులు నిమ్మ కునీరెత్తినట్లు వ్య వహరిస్తున్నా రనీ, చర్మ, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో పాటు దీర్ఘకాలిక రోగాలు వస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంటు (బిటిపిఎస్) పరిసర గ్రామాల ప్రజల ఇబ్బందుల పై విజయ క్రాంతి పరిశీలనాత్మక కథనం...
మసిబారుతున్న పల్లెలు
ఎక్కడైనా పరిశ్రమలు వ స్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెంది, స్థానికులకు ఉపాధి అవకాశాలు వస్తాయి.కానీ రాష్ట్రానికి వెలుగులు పంచుతున్న బి టి పి ఎస్ పరిసర పల్లెలకు పరిశ్రమ శాపంలా మారిందని గ్రామాలలో కాలుష్యం భయాం దోళనలు రేకెత్తిస్తోందని, థర్మల్ స్టేషన్ నుంచి వెలువడే పొగ, బూడి ద వల్లవాయు, జల కాలుష్యం ఏర్పడు తోం దని స్థానికులు చెబుతున్నారు. రోజుకు వం దల సంఖ్య లో లారీల ద్వారా బూడిద తరలింపు జరపడం వ ల్ల చుట్టుపక్కల గ్రామా ల్లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థితికి చేరిందని వాపోతు న్నారు.
మసిబారుతున్న గ్రామాలు
ప్లాంట్ చిమ్నీల నుంచి వెలువడే పొగ ఉ క్కిరి బిక్కిరి చేస్తుండ గా బూడిద వ్యర్థాలు గాలిలో కలసి కాలుష్యం పెరిగి పచ్చటి పల్లెలను బూడిద కమ్మే స్తోంది. థర్మల్ ప్లాంట్ నుంచి వెలువడే వాయుకాలుష్యం దెబ్బకు పరి సర గ్రామాలు విలవిల లాడు తుండగా ఆయా కాలుష్య కారకాలను పీల్చుకుని ప్రజ లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇక పశు పక్ష్యాదుల సంగతి సరే సరి. విష పూరిత కాలుష్య రేణువులు వెలు వడకుండా చర్యలు చేపట్టాల్సి ఉన్నా..
బిటిపి ఎస్ అధికారుల పట్టింపులేని తనంతోనే తమకు ఈ ఇబ్బందులు ఎదురవు తున్నాయని బాధిత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధర్నాలు, ఆం దోళనలు చేసి నప్పుడు ప్రజా ప్రతినిధుల సమక్షంలో హామీలుఇస్తున్నా.. ఆ త ర్వాత వాటిని తుంగలో తొకడం షరామామూలైందని మండి పడుతున్నారు... కళ్లు, ఒళ్లు మండి పోతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు.
బీటీపీఎస్ నిర్లక్ష్యంతో ప్రజల ఇక్కట్లు
భద్రాద్రి పవర్ ప్లాంట్ నుండి వెలు వడుతున్న బూడిద (యాప్) తరలించే బూడిద ట్యాంకర్లే ప్రధాన రహదారి నిండా దర్శనమిస్తున్నాయి. వాటి మూలంగా అనేక ప్రమా దాలు చోటు చేసుకుంటున్నాయి. ట్యాంకర్ల నుండి వెలువడుతున్న బూడిదతో పీల్చేగా లి... తినే తిండి.. తాగే నీరూ కలుషితమై ప్రజలను అనారోగ్య పాలు చేస్తోంది. శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు, చర్మ సంబంధిత వ్యాధు లతో జీవితాలు మసకబారి పోతున్నా యి.
చివరకు పరిసర గ్రామాల ప్రజల ఇక్కట్లు బూడిద ముసిరిన బతుకులుగా మా రుతున్నాయి. బూడిద, దుమ్ము, ధూళి కారణంగా ఒంటిపై దద్దుర్లు , చర్మంపై మచ్చలు వస్తున్నాయని, ప్రజలు ఆగ్రహిస్తున్నారు. పరిశ్రమ ప్రభావిత గ్రామాలో యాజ మాన్యం తో పాటు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వారం వారం వైద్య పరీక్షలు చేయా ల్సి ఉన్నా గ్రామాల్లో ఆపరిస్థితి కనిపించడం లేదని. ప్రారంభంలో కొంత కాలం సీఎస్ ఆ ర్ కింద యాజమాన్యం మొక్కుబడి శిబిరా లు నిర్వహిం చినా.. ఇప్పు డు తమ వైపు కన్నెత్తి చూడటం లేదనిబాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంటలపైన ప్రభావం..
ప్లాంట్ నుండి వెలబడుతున్న యాష్ కా రణంగా చుట్టు పక్కల గ్రామాల ప్రజలు అ నేక ఇబ్బందులకు గురవుతున్నారు. త్రాగే మంచి నీటి నుండి పండించే పంటల వరకు ప్రజలుఇబ్బందులను పడుతున్నారు. పరిసర గ్రామాలైన చిక్కుడు గుంట, దమక్క పేట, సాంబాయి గూడెం, రాయిగూడెం, పో తిరెడ్డిపల్లి, ఏడుల్ల బయ్యారం, సీతారాంపు రం, ఉప్పాక, బొమ్మరాజుపల్లి తదితర గ్రా మాల ప్రజలు నిత్యం బూడిదతో సహ జీవ నం చేస్తున్నారు.
ప్రజలకు ఎటువంటి ఇబ్బం దులు కలగకుండా పవర్ ప్లాంట్ ను కొనసాగించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదే శాలు ఉన్నప్పటికీ వాటిని పాటించడం లో బిటిపిఎస్ అధికారులు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. నిత్యం మంచు దుప్పటిలా గ్రా మాలన్నీ బూడిదతో దర్శనమిస్తున్నాయి. వ చ్చని చెట్లు బూడిదపారి నల్లగా మారిపోతున్నాయి.
వరి, ప త్తి, మిరప సాగు చేసే రైతుల కు దిగు బడులు తగ్గి అర్ధం కాని పంట తెగుళ్లతో నష్ట పోతున్నామని ఆందోళన చెందు తున్నా రు .ఈ విషయంపై రాజ కీయనాయకులు, పలువురు ప్రకృతి ప్రేమికులు పలు మార్లు చర్యలు తీసుకోవాలని కోరిన కాలు ష్య సమస్యను అరికట్టడంలో ప్లాంట్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటి కైనా పవర్ ప్లాంట్ యాజమాన్యం స్పందించి గ్రామాలలో కా లుష్య నివారణ చర్యలు చేపట్టాలని ప్రజలు, నాయకులు డిమాండ్ చేస్తున్నారు.