1 April, 2026 | 2:27 AM

100 కోట్లతో బాసర అభివృద్ధి పనులు

01-04-2026 12:49 AM

6న అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన 

దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు వెల్లడి 

భైంసా, మార్చి ౩1 (విజయక్రాంతి): దక్షిణ భారతదేశంలోని ఏకైక సరస్వతి నిలయమైన శ్రీ జ్ఞాన సరస్వతి బాసర ను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరిచేందుకు కృషి జరుగుతున్నట్టు దేవదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు వెల్లడించారు. ఈనెల 6న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బాసర 100 కోట్ల యాక్షన్ ప్లాన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్టు వెల్లడించారు. మంగళవారం బాసరను సందర్శించి ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అక్కడ చేపట్టే అభివృద్ధి పనుల పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

బాసరలో భక్తుల రద్దీ కనుగుణంగా ఆలయ విస్తరణ. కొత్త పుష్కర ఘాట్లు. ట్రాఫిక్ నియంత్రణకు రోడ్లు. విశ్రాంతి గదులు. మౌలిక సదుపాయా ల పనులు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో టూరిజం అభివృద్ధి తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. బాసరలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అందుకు అన్ని ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. బాసర పరిసర ప్రాం తాలను పరిశీలించి స్థానికులు పూజారులు అక్కడ ఉన్న అధికారులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు.

కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ.. ఈనెల 6న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో వివిధ అభివృద్ధి పనుల ను చేపట్టి విధంగా యాక్షన్ ప్లాన్ రూపొందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్ర మంలో దేవాదాయ కమిషనర్ విజయ రా మారావు ఆర్‌అండ్‌బి పంచాయతీరాజ్ దేవాదాయ విద్యుత్తు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు బాసర అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధికారులు పూజారులు పూర్ణకుంభంతో స్వాగత పలికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ పవన్ చంద్ర, స్థానిక అధికారులు ఉన్నారు.