18 April, 2026 | 8:27 AM

బతుకమ్మ కుంట అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

26-06-2025 05:09 PM

జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్...

జనగామ (విజయక్రాంతి): జనగామ పట్టణంకి బతుకమ్మ కుంట స్పెషల్ అట్రాక్షన్ గా కనపడేలా అభివృద్ధి పనులు జరగాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్(Collector Rizwan Basha Shaik) తెలిపారు. గురువారం పట్టణంలో కేంద్రంలో గల బతుకమ్మ కుంటను అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్(Additional Collector Pinkesh Kumar)తో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సందర్శించి, అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ.. రూ. కోటి 50 లక్షలతో బతుకమ్మ కుంట అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయన్నారు. 

ఈ మేరకు బతుకమ్మ కుంటను పంచతంత్ర థీమ్ తో అభివృద్ధి చేయాలనీ, సుందరీకరణ నేపథ్యంలో గ్రిల్స్, గజిబోలు, వ్యాయామ పరికరాలు, చిన్నారుల ఆటస్థలం, ఆడుకునేందుకు పరికరాలు, చిన్న పార్కు ఏర్పాటుకు ప్రారంభించిన పనులను వేగవంతం చేసి, నెల రోజుల్లోగా పూర్తిచేయాలని ఆదేశించారు. 

ఇప్పటి వరకు చెరువు పూడికతీత పనులు,వాకింగ్ ఏరియా, లైటింగ్, ఫెన్సింగ్, ఒక వాటర్ ట్యాంక్ పనులు అయిపోయాయని మిగతా పనులు కూడా త్వరగా పూర్తి చేయాలన్నారు. అకాల వర్షాల వల్ల  చెరువు పూడికతీత పనులు ఆలస్యం కావడం వల్ల సివిల్ వర్క్స్ చేసేందుకు వీలు కాలేదని.. ఇప్పుడు వర్షాలు తగ్గడంతో పూడికతీత పనులు పూర్తయ్యాయని.. దీంతో సివిల్ వర్క్స్ వేగవంతం కావాలన్నారు, ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, డిఈ రాజ్ కుమార్, AE మహిపాల్ పాల్గొన్నారు.