29 July, 2026 | 1:37 AM

విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి

29-07-2026 12:31 AM

‘మీ సురక్ష’తో అవగాహన

ఇందిరా స్కూల్లో సైబర్ క్రైమ్, పోక్సో చట్టం, డ్రగ్స్‌పై ప్రత్యేక సదస్సు

ఉప్పల్ జూలై 28 (విజయక్రాంతి): నేటి డిజిటల్ యుగంలో విద్యార్థులు సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వంటి సామాజిక ప్రమాదాల బారిన పడకుండా అప్రమత్తం గా ఉండాల్సిన అవసరం ఉందని నాచారం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ధనుంజయ గౌడ్ పేర్కొన్నారు.

తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీ సురక్ష కార్య క్రమంలో భాగంగా నాచారం పరిధిలోని ఇందిరా స్కూల్లో మంగళవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన ఇన్స్పెక్టర్ ధనుంజయ గౌడ్, సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పాటించాల ని, తెలియని వ్యక్తులతో వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని సూచించారు. అలాగే బాలల రక్షణ కోసం అమలులో ఉన్న పోక్సో చట్టం ప్రాముఖ్యతను వివరించారు.

డ్రగ్స్కు దూరంగా ఉండి విద్య, క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాలపై దృష్టి సారించాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం ఎస్‌ఐ మైబెల్లి సైబర్ నేరాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆన్లైన్ మోసాల నుంచి రక్షణ పొందే మార్గాలపై అవగాహన కల్పించారు. సైబర్ క్రైమ్ వారియర్ పీసీ అనిల్ కూడా పాల్గొని సైబర్ భద్రతకు సంబంధించిన కీలక సూచనలు అందించారు. విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. భద్రత, చట్టాలపై అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పాఠశాల యాజమాన్యం అభిప్రాయపడింది.