19-10-2025 01:02:18 AM
-ఆరు నెలలుగా కేంద్రం వద్ద పెండింగ్
-రెండు నాలుకల ధోరణితో బీజేపీ బీఆర్‌ఎస్, బీజేపీ నేతలకు మాట్లాడే నైతిక హక్కు లేదు: మంత్రి సీతక్క
హైదరాబాద్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): బీసీలకు న్యాయం చేయాలంటే కేంద్రం బీసీ బిల్లును వెంటనే ఆమోదించాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు బీసీ బంద్ నిర్వహి స్తున్నామని తెలిపారు. రాష్ర్టవ్యాప్తంగా నిర్వహించిన బీసీ బంద్‌ను మంత్రి సీతక్క ప్రజాభవన్ నుంచి పర్యవే క్షించారు. ఆమెతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి పాల్గొన్నారు.
అనంతరం ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీ, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇతర నేతలతో కలిసి బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం నిర్వహించిన ప్రద ర్శనలో పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత డా బీఆర్ అం బేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన నేతలు ‘జై బీసీ’, ‘బీసీల ఐక్యత వర్ధిల్లాలి’, ‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధిద్దాం’ అంటూ నినదించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ... ‘బీసీ రిజ ర్వేషన్ల కోసం మా ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది.
అందుకే ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి, కులగణన ప్రక్రియను ఎక్కడా లోపం లేకుండా పూర్తి చేశాం. బీసీ రిజర్వేషన్ల పెంపు కోరుతూ అసెంబ్లీలో బిల్లును ఆమోదించాం. కానీ ఆ బిల్లు ఆరు నెలలుగా కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది’ అని పేర్కొన్నారు. కేం ద్రంలో బీజేపీ ప్రభుత్వం బీసీలకు న్యాయం చేయకుం డా బిల్లును నిలిపి వేస్తోందని ఆమె విమర్శించారు. ‘బీజేపీ రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తోంది. తెలంగాణలోని బీజేపీ నేతలు బీసీ రిజర్వేషన్లకు మద్ద తిస్తామంటారు, కానీ ఢిల్లీలో వారి పెద్దలు ‘నో’ అంటా రు.
బీసీ అని చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోదీ తెలంగా ణ బీసీ బిల్లుకు వెంటనే ఆమోదం తెలపాలి’ అని సీతక్క డిమాండ్ చేశారు. ‘బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలకు మాట్లాడే నైతిక హక్కు లేదు. కులగణనలో పాల్గొనని వారు బీసీల హక్కులపై మాట్లాడడం హాస్యాస్పదం. వారికి ప్రజలే సమాధానం చెబుతారు’ అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.