calender_icon.png 9 December, 2025 | 7:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఛలో ఢిల్లీకి బయలుదేరిన బీసీ సంఘం నాయకులు

09-12-2025 05:42:57 PM

ముకరంపుర (విజయక్రాంతి): బీసీల 42 శాతం రిజర్వేషన్లు, హక్కులు, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ప్రధానమైన డిమాండ్ తో ఈనెల 10, 11, 12న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే ధర్నాకు ఉమ్మడి జిల్లా నుంచి బీసీ సంఘం నాయకులు మంగళవారం తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింగోజు శ్రీనివాస్, నాయకులు శ్రీమన్నారాయణ, మనోజ్ గౌడ్, గుంటి స్వరూప, హసీనా, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.