calender_icon.png 9 December, 2025 | 6:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ అభివృద్ధి నా లక్ష్యం

09-12-2025 05:35:57 PM

సర్పంచ్ అభ్యర్థి బొమ్మ వీరస్వామి గౌడ్ 

జనగామ (విజయక్రాంతి): గ్రామాభివృద్ధి నా కర్తవ్యం అని రఘునాథ్ పల్లి మండలం నిడిగొండ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి బొమ్మ వీరస్వామి గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. నిడిగొండ గ్రామ సర్పంచ్ గా అత్యధిక ఓట్లు వేసి గెలుపించగలరు అని కోరారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని రోడ్లు మరియు వాటర్ సమస్యలు, ఆదర్శ గ్రామంగా జిల్లాలో మొదటిగా ఉండేట్లు చూస్తానని అన్నారు. వృద్ధుల కోసం, యువత కోసం, మహిళల కోసం ప్రత్యేక కార్యాచరణ చేస్తానని అన్నారు.