calender_icon.png 13 June, 2025 | 1:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ సంఘం విద్యార్థి నాయకునికి సన్మానం..

11-06-2025 05:08:36 PM

రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): రామకృష్ణాపూర్ పట్టానికి చెందిన పూరెళ్ల నితీష్ కుమార్ జాతీయ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్(Socialist Republican Association) ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్న్అధ్యక్షుడు అడ్వకేట్ డా.మోతె రాజలింగు మాట్లాడుతూ... పూరెళ్ల నితీష్ కుమార్ గతంలో పిడిఎస్యూలో జిల్లా కోశాధికారిగా, టీజేఎస్ విద్యార్థి విభాగం జిల్లా కోకన్వీనర్ గా, ఎన్సిపి విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులుగా చేసిన సేవలను కొనియాడారు. నిరంతరం విద్యార్థుల సమస్యలపై పోరాడాలని సూచించారు.