calender_icon.png 18 July, 2025 | 3:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌లో ‘బీసీ’ నయా జోష్..

18-07-2025 12:30:41 AM

- స్థానిక సంస్థల ఎన్నికల్లో హస్తం వైపు పక్క పార్టీ నేతల చూపు 

- జిల్లా వారిగా పరిషత్ స్థానాలను అధికారికంగా ప్రకటన 

- రిజర్వేషన్ల పైనే అందరిలో ఉత్కంఠ

- పల్లెల్లో మొదలైన ఆశావావుల సందడి

- బీసీ కి జడ్పీ స్థానం అంటూ ప్రచారం 

 రంగారెడ్డి,జూలై 17 (విజయక్రాంతి ): కాంగ్రెస్ పార్టీలో బీసీ రిజర్వేషన్ అంశం కొ త్త జోష్ తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలో కి వస్తే కామారెడ్డి డిక్లరేషన్ లో 42 శాతం అమలు చేస్తామంటూ హామీ ఇచ్చింది. దానికనుగుణంగానే రేవంత్ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పకడ్బంద్గా కసరత్తులు ఇప్పటికే ప్రారంభించింది. క్యాబినెట్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ అంశం ఆమోదించి రాష్ట్ర గవర్నర్కు సైతం బిల్లును పంపింది. గవర్నర్ నుంచి బిల్లు సానుకూల నిర్ణయం వస్తుందని ప్రభుత్వం భావిస్తుంది.

దీంతో కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని జిల్లాల్లో అన్ని స్థానాలను క్లీన్ స్వీప్ చేసేలా ప్రణాళికలను రచించే పనిలో నిమగ్నం అయింది.గత అసెంబ్లీ ఎ న్నికల్లో రంగారెడ్డి జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఉండగా కేవలం ఇబ్రహీంపట్నం, షాద్నగర్,కల్వకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తమ ఖాతాలో వేసుకోగా  రాజేంద్రనగర్, ఎల్బీనగర్,మహేశ్వరం, శేర్లింగంపల్లి, చేవెళ్ల బీ ఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు  గెలిచారు.

  దానిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్  క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తుంది. బీసీ 42 శాతం రిజర్వేషన్ను అంశంపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేస్తూ  స్థానిక సంస్థల్లో అ న్ని స్థానాలను గెలుచుకొనే లా ఎత్తుగడలు వేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర పార్టీ ఇంచార్జి మీ నాక్షి నటరాజన్,జిల్లా ఇన్చార్జి  శివసేన రెడ్డి లు పార్టీ ఆదేశానుసారం  జిల్లాలోని ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల తో ప్రత్యేక సమావేశాలు పలు దపాలు గా నిర్వహిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను సంసిద్ధం చేసే పనులు పూర్తిగా నిమగ్నమయ్యారు.

కాంగ్రెస్ వైపు పక్క పార్టీ నేతల చూపు

 స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు చట్టపరంగా చర్యలు ప్రారంభించడంతో ప్రతిపక్ష పార్టీల నాయకులు, కా ర్యకర్తలు కాంగ్రెస్ పార్టీ వైపు ప్రస్తుతం పక్క చూపులు చూస్తున్నారు. తమ వేగులను పంపించి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు తాము సిద్ధమంటూ సిగ్నల్స్ ను ము ఖ్య నేతలకు పంపిస్తున్నారు. సర్పంచ్, ఎంపీ పీ,జడ్పిటిసి,జడ్పీ చైర్మన్ల ఇలా  పదవుల కు సంబంధించి పార్టీ టికెట్లు కేటాయిస్తామని తమకు హామీలు ఇస్తే తాము పార్టీ మారెందుకు సిద్ధమంటూ జిల్లాలో  బిజెపి, బీఆర్ ఎస్  పార్టీ నేతలు ఇప్పటికే పార్టీ జిల్లా ఇన్చార్జిలు స్థానిక ఎమ్మెల్యేలతో టచ్ లోకి వచ్చి మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. వా ళ్లు సైతం  క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు  అంతర్గతంగా హామీలు ఇస్తున్న ట్లు కూడా ప్రచారం సాగుతుంది.

స్థానిక సం స్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99%  సీట్లను కైవాసం చేసుకోవాలంటూ ఇటీవలనే ము ఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ఆయా జిల్లా మం త్రులను,ఎమ్మెల్యేను ఆదేశించారు. దానికనుగుణంగానే  ఆయా నియోజకవర్గాల్లో ప్రాదే శిక స్థానాలను గెలుచుకునేందుకు  పార్టీలో బలమైన నేతలను తమ పార్టీలో లాగేందుకు  చర్చలు స్విడాప్ అప్ చేసినట్టు కూడా ప్రచా రం సాగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం  అమ లు చేస్తున్న బీసీ రిజర్వేషన్ ఎత్తుగడ అం శంలో బీ ఆర్‌ఎస్,బిజెపి పార్టీ నేతలు నోరు మెదపా కుండా సైలెంట్ కావడంతో ఆయా పార్టీలో కొంత నైరాశం అలుము కుంది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తుకొన్న బిసి రిజర్వేషన్ అంశం విషయంలో బీసీ నేతలు పెద్ద ఎత్తున స్వాగతిస్తూ సంబరాలు సైతం జరుపుకుంటున్నారు. బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు జరిగితే  జిల్లాలో సర్పంచులు,ఎంపీటీసీలు, జడ్పిటిసిలు, కౌ న్సిలర్లు, కార్పొరేటర్లు పెద్ద ఎత్తున బీసీలకు పదవులు దక్కి అవకాశం ఉంటుంది. తే రం గారెడ్డి జిల్లా జడ్పీ స్థానం  బీసీలకు దక్కుతుందంటూ క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం సాగుతుంది. ఇప్పటివరకు రంగారెడ్డి జిల్లాలో నాలుగు సార్లు జర్నల్ అభ్య ర్థులrకే పదవులు దక్కాయి. ఈ దెబ్బ మాత్రం బి సి లేక, ఎస్సీ,ఎస్టీల కు కేటాయిం చే అవకాశం కూడా ఉందంటూ కూడా ప్రచారం సాగుతూ వస్తుంది.

అధికార లెక్కపై స్పష్టత

 జిల్లాలో 21 మండలాల్లో ప్రాదేశిక స్థానాలపై ఎట్టకేలకు ప్రభుత్వం అధికారికం గా లెక్కలను ఖరారు చేసింది. జిల్లాల్లో 27 మండలాలు ఉండగా రాజేంద్రనగర్,ఎల్బీనగర్ పూర్తిస్థాయిలో జిహెచ్‌ఎంసి పరిధి కాగా మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో కొన్ని గ్రామాలు మున్సిపాలిటి లో ప్ర భుత్వం ఇటీవల  విలీనం చేయడంతో పాటు చేవెళ్ల,మొయినాబాద్ మండలాలు కొత్తగా మున్సిపాలిటీలుగా ఏర్పడ్డాయి. దీంతో 21 మండలాల్లో ఎంపీటీసీ, జడ్పిటిసి,సర్పంచు లు, వార్డు స్థానాలు ఖరారు అయ్యాయి.

2019లో జిల్లాలో 257 ఎంపిటిసి స్థానాలు ఉండగా ప్రస్తుతం 27 ఎంపీటీసీ స్థానాలు కోల్పోయి  230 కి తగ్గింది. పంచాయతీలో 558 ని స్థానాలు ఉండగా అందులో 32 స ర్పంచ్ స్థానాలు కోల్పోయి 526 కి ఆ సంఖ్య చేరింది. అయితే గవర్నర్ నుంచి 42 శాతం ఆర్డినెన్స్ రాగానే ఎన్నికల నోటిఫికేషన్ అధికారులు విడుదల చేయనున్నారు.  ఆ లెక్క ప్రకారం జిల్లా వారీగా రిజర్వేషన్లను ప్రభు త్వం ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ  చేయడంతోనే....జిల్లాలో స్థానిక సమరం మొదలుకానుంది.