18-07-2025 12:29:51 AM
మంచిర్యాల, జూలై 17 (విజయక్రాంతి): సింగరేణి ప్రజా సంబంధాల అధికారి (పీఆర్‌వో)గా విధులు నిర్వహిస్తున్న శ్రీరాముల శ్రీకాంత్ జర్నలిజంలో డాక్టరేట్ అందుకున్నారు. ఆయన సమర్పించిన పరిశోధన అధ్యయనానికి తెలంగాణ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు.
‘సాంఘిక, రాజకీయ ఉద్యమాల్లో సామాజిక మాధ్యమాల పాత్ర, తెలంగాణ ఉద్యమంపై కేస్ స్టడీ’ అనే అంశంపై సమర్పించిన పరిశోధనాత్మక అధ్యయనానికి నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీలో జరిగిన రెండవ స్నాతకోత్సవంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్, యూనివర్సిటీ చాన్స్‌లర్ జిష్ణుదేవ్ వర్మ నుంచి డాక్టరేట్ సర్టిఫికెట్ ప్రదానం చేశారు.
డాక్టరేట్ అందుకున్న శ్రీరాముల శ్రీకాంత్‌ను సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) బలరాం నాయక్‌తో పాటు ఈడీ (కోల్ మూమెంట్) ఎస్.డి.ఎం సుభాని, జీఎం (మార్కెటింగ్) శ్రీనివాస్, సింగరేణి భవన్ అధికారులు, పర్సనల్ విభాగం అధికారులు, ఉద్యోగులు అభినందించారు.