తీన్మార్ మల్లన్నకు బీసీ ఎన్‌ఆర్‌ఐల మద్దతు
- పెన్సిల్వేనియాలో పర్యటిస్తున్నటీఆర్పీ అధినేత మల్లన్న
- తెలంగాణ వేణు ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం
హైదరాబాద్, జూన్ 6(విజయక్రాంతి): అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని మిడ్ అ ట్లాంటిక్ రీజియన్‌కు చెందిన ప్రముఖ రా ష్ట్రం పెన్సిల్వేనియాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్ల న్న పర్యటిస్తున్నారు. కాగా తెలంగాణ వేణు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అక్కడి బీసీ ఎన్‌ఆర్‌ఐలు మల్లన్నని కలుసుకొని ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో తెలంగాణ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, బీసీ వర్గాల వెనుకబాటుకు గల కారణాలు, అగ్రవర్ణ పార్టీల దోపిడీ విధానాలు, బీసీ రాజ్యాధికార పోరాటం ప్రాము ఖ్యత, ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న బీసీ ఉద్యమం, తెలంగాణ రాజ్యాధికార పా ర్టీ స్థాపన వెనుక ఉన్న లక్ష్యాలు వంటి కీలక అంశాలను మల్లన్న వివరించారు.
తెలంగాణలో బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక న్యాయం సాధించేందుకు మల్లన్న చేస్తున్న పోరాటానికి ఆయన నిర్మిస్తున్న బీసీ ఉద్యమానికి అక్కడి బీసీ ఎన్‌ఆర్‌ఐలు పూర్తి మద్ద తు ప్రకటించారు. భవిష్యత్తులో ఈ ఉద్యమానికి తమ వంతు సహకారం అందిస్తామని వారు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం నిర్వహించిన తెలంగాణ వేణుకి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
నేడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ‘మీట్ అండ్ గ్రీట్’
తెలంగాణ ప్రజా గొంతుక, ప్రముఖ రాజకీయ నాయకులు, టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో అమెరికాలో ఆదివారం ప్రవాస భారతీయులు, తెలంగాణ బిడ్డల ముఖాముఖి సమావేశం (మీట్ అండ్ గ్రీట్) ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. న్యూజెర్సీలోని ప్రిన్స్‌టన్ నగరంలో గల ప్రసిద్ధ ‘గోదావరి రెస్టారెంట్’ వేదికగా ఈ ప్రత్యేక ఇంటరాక్టివ్ కార్యక్రమం జరగనుంది. తెలంగాణ సమకాలీన రాజకీయా లు, సామాజిక మార్పులు, బీసీ రాజ్యాధికార ఆశయాలు, ప్రవాస తెలంగాణ వాసుల పాత్రపై ఈ సమావేశంలో తీన్మార్ మల్లన్న సుదీర్ఘంగా చర్చించనున్నారు.






