11-11-2025 12:00:00 AM
- తెలంగాణ ఉద్యమ తరహాలో, బీసీ రిజర్వేషన్ల ఉద్యమం
- ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ జేఏసీ చైర్మన్, వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్
హనుమకొండ, నవంబర్ 10 (విజయ క్రాంతి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి పురుడు పోసుకున్న కాకతీయ యూనివ ర్సిటీ గడ్డ మీద మళ్లీ బీసీ రిజర్వేషన్ల ఉద్యమానికి శ్రీకారం చుట్టిందని, రాష్ట్ర ప్రభుత్వం విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల కోటాలో 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా తీర్మానం చేసిన బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభు త్వం 9వ షెడ్యూల్లో చేర్పించి, బీసీలకు సత్వర న్యాయం చేయాలని, మేమేంతో మా కంతా వాటా అంటూ ధర్మంగా పోరాడుతున్న బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే రాజ్యాంగ సవరణ చేయాలని బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జి ల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ డిమాండ్ చేశారు.
సోమవారం కాకతీయ యూనివర్సిటీలోని ఎస్డీఎల్సీ ప్రాంగణంలో బీసీ విద్యార్థి జేఏసీ కాకతీయ యూనివర్సిటీ చై ర్మన్ ఆరేగంటి నాగరాజు గౌడ్ నేతృత్వం లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్ చేస్తూ, బీసీ విద్యార్థులు ధ ర్మదీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ ధర్మదీ క్షను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుండి అన్ని రంగాల్లో వెనుకబడిన బీసీ కులస్తులకు రిజర్వేషన్లు లేని కారణంగా బీసీలు అన్ని రంగాల్లో వెనుకబడి, అగ్రవర్ణ రాజకీయ పార్టీల జెండాలు మోసే కార్యకర్తలు గా ను, ఓట్లు వేసే యంత్రాలుగాను మిగిలిపోయారన్నారు.
దేశంలో అన్ని వర్గాల వారికి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉంటే, కేవ లం బీసీలకు మాత్రం రిజర్వేషన్లు లేని కారణంగా రాజకీయంగా, ఆర్థికంగా అణచివేత కు గురిచేయబడుతున్నారని ఆందోళన వ్య క్తం చేశారు. బీసీ విద్యార్థులు చేస్తున్న ధర్మదీక్షతోనైనా కేంద్ర ప్రభుత్వం బీసీలకు రాజ్యాం గపరంగా రిజర్వేషన్లను కల్పించేందుకు ముందుకు రావాలని, లేనియెడల ఉద్యమా న్ని గ్రామస్థాయి నుండి పటిష్టం చేసి, గల్లీ నుండి ఢిల్లీ వరకు పోరుబాట పట్టి కేంద్ర ప్ర భుత్వం మెడలు వంచుతామని హెచ్చరించా రు. కేయూ పాలకమండలి సభ్యులు, బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డా. చిర్ర రాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పంతానికి పోయి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బిల్లును అడ్డుకొని బీసీలకు అన్యాయం చే యొద్దని, బీసీ రిజర్వేషన్లను కల్పిస్తే రాష్ట్ర ప్ర భుత్వానికి పేరు వస్తుందని, బిజెపి ప్రభు త్వం బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటుందని ఆయన ఆరోపించారు.
అగ్రవర్ణ రాజకీయ పార్టీలలోని నాయకులంతా పార్టీలకతీతంగా బీసీ ఉద్యమంలో కలిసి రాకపోతే వారికి రా జకీయ భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు. కొందరు అగ్రవర్ణ పార్టీలకు తలోగ్గిన నేతలు బీసీ ఉద్యమాన్ని నీరు కార్చేందుకు కుట్రలు చేస్తున్నారని, వారిని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీ విద్యార్థులు రిజర్వేషన్లను సాధించేందు కు పోరుబాట పట్టారని, వారి పోరాటం ఉగ్రరూపం దాల్చకముందే కేంద్ర ప్రభుత్వం వెం టనే దిగివచ్చి బీసీలకు జనాభా దామాషా ప్రకారం చట్టసభలలో రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్మదీక్షను తెలుగు విభాగాధిపతి మామిడి లింగయ్య నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ ఉమ్మడి బీసీ జేఏసీ వైస్ చైర్మన్లు బోనగాని యాదగిరి గౌడ్, దాడి మల్లయ్య యాదవ్, దొడ్డిపల్లి రఘుపతి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బచ్చు ఆనందం, రాష్ట్ర కార్యదర్శి భీమగాని యాదగిరి గౌడ్, బీసీ నాయకులు బక్కి అవినాష్, ప్రొఫెసర్లు మండ సారంగపాణి, శ్రీనివాసరావు, ఆకుతోట శ్రీనివాస్, సంఘాని మల్లే శ్వర్, కృష్ణ యాదవ్, సంకినేని వెంకన్న, ర మేష్, బీసీ విద్యార్థి నాయకులు సుమన్, అ జయ్, గణేష్, రాజశేఖర్, రాజ్ కుమార్, నితి న్, సంజీవ్, రాజేష్, అనిల్, వినోద్, సాయి కృష్ణ, మహేష్, నాగరాజ్ యాదవ్, నాగరా జు పటేల్, చిర్ర సుమన్, వేముల మహేందర్, తిరుపతి తదితరులుపాల్గొన్నారు.