calender_icon.png 15 September, 2025 | 4:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏప్రిల్ 5లోపు రాజీవ్ యువ వికాసం పథకం క్రింద బీసి నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకోవాలి

19-03-2025 03:06:16 PM

 జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జే. రంగారెడ్డి

పెద్దపల్లి,(విజయక్రాంతి): ఏప్రిల్ 5 లోపు రాజీవ్ యువ వికాసం పథకం క్రింద బీసి నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జే. రంగారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల కులాలకు చెందిన  నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు ద్వారా ఆర్థిక పురోగతి పెంపొందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రకటించిందని తెలిపారు. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఆదాయ ధ్రువీకరణ పత్రం కుల ధ్రువీకరణ పత్రం ఫోటో ,స్టడీ సర్టిఫికెట్, మొబైల్ నెంబర్ లతో ఆన్ లైన్ నందు దరఖాస్తుల సమర్పించాలని అన్నారు.

రాజీవ్ యువ వికాసం పథకం కింద బీసీ నిరుద్యోగులను స్వయం ఉపాధి పథకాలు అందించడానికి ప్రణాళిక ఆమోదించిందని అన్నారు.  జిల్లా వ్యాప్తంగా ఆసక్తి అర్హత గల నిరుద్యోగ బీసి యువత ఆన్ లైన్ పోర్టల్ https://tgobmmsnew.cgg.gov.in వెబ్సైట్ నందు ఏప్రిల్ 5లోగా దరఖాస్తు చేసుకోవాలని , మరిన్ని వివరాలకు సమీకృత జిల్లా కలెక్టరేట్ నందు గల బిసి అభివృద్ధి అధికారి కార్యాలయంలో  సంప్రదించాలని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.