21-01-2026 01:42:58 AM
ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోదించాలి
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్
పార్లమెంటును ముట్టడిస్తాం
మహిళా అధ్యక్షురాలు మని మంజరి సాగర్
హైదరాబాద్, జనవరి 20 (విజయక్రాంతి): బీసీ మహిళలకు రాజకీయ ప్రాతిని ధ్యం లేని మహిళ బిల్లును బీసీ సమాజం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోదని, మహి ళా బిల్లుకు సంపూర్ణ సాధికారత లభించాలంటే బీసీ మహిళలకు సబ్ కోట కల్పిం చాల్సిందేనని బీసీ సంక్షేమ సంఘం జాతీ య అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాదులోని బీసీ భవన్‌లో బీసీ మహిళ సంక్షే మ సంఘం ఆధ్వర్యంలో 2026 నూతన సంవత్సరం క్యాలెండర్‌ను బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి మని మంజరి సాగర్‌తో కలిపి జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా బిల్లు వలన గత 80 సంవత్సరాలుగా పరిపాలిస్తున్న అగ్రకుల సామాజిక వర్గానికి చెందిన పురుషులే రాజకీయ ఆధిపత్యం చేస్తున్నారని, మహిళా బిల్లు నెరవేరితే అగ్రకులాల స్థానాలలో అగ్రకుల మహిళలు వారి కు టుంబ వారసత్వ మహిళలు మాత్రమే మహిళా బిల్లు వల్ల ప్రయో జనం పొందుతారని, బీసీ మహిళలకు నామమాత్రపు రాజకీయ ప్రాతినిధ్యం కూడా దక్కదన్నారు.
బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఈ మని మంజరి సాగర్ మాట్లాడుతూ.. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోట దక్కించుకోవడానికి ఈ నెల 28 నుండి ఢిల్లీ లో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో చలో ఢిల్లీ చేపడుతామని హెచ్చరించారు. బీసీ మహిళలకు సబ్ కోట పార్లెంటులో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని లేనిపక్షంలో వేలాదిమంది మహిళ లతో ఫిబ్రవరి మొదటి వారంలో పార్లమెంటు ముందు భారీ ధర్నా కార్యక్రమాన్ని చేపడతామని ఆమె తెలిపారు. కార్యక్రమంలో బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తారకేశ్వరి, సంధ్యారాణి, శ్యామల, కుల్కచర్ల శ్రీనివాస్, తాటి కొండ విక్రమ్ గౌడ్, విజయలక్ష్మి, వెంకటమ్మ, శైలజ గౌడ్, నరసమ్మ, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.