31 July, 2026 | 12:52 AM

ప్రజా ఉద్యమాల దిశగా బీసీఐఎఫ్

31-07-2026 12:11 AM
  1. రెండో వార్షికోత్సవ సమావేశంలో నిర్ణయం
  2. ఆగస్ట్ 9న నల్గొండ బీసీ పోరాట సభ పోస్టర్ల ఆవిష్కరణ
  3. రాజకీయ పార్టీ దిశగా అడుగులు
  4. భవిష్యత్‌లో తుది నిర్ణయం అధ్యక్షుడు చిరంజీవులు, సభ్యులు

హైదరాబాద్, జూలై 30 (విజయక్రాంతి) : బీసీఐఎఫ్ (బీసీ ఇంటెలెక్టువల్స్ ఫోరం) కేవలం భావజాల ప్రచార సంస్థగా కాకుం డా, ప్రజా సమస్యలు, సామాజిక న్యాయం, వెనుకబడిన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యక్ష ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి గురువా రం కాచిగూడ బీసీఐఎఫ్ రెండో వార్షికోత్సవ సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షుడు టి. చిరంజీవులు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు.

వచ్చే ఆర్థిక సంవత్సరం అన్ని జిల్లాల్లో శిక్షణా కార్యక్రమాలు, మం డల, జిల్లా, గ్రామీణ స్థాయిల్లో శిక్షణా వ్యవస్థను బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం సోషల్ మీడియా వేదికలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, యువతను ఉద్యమంలో భాగస్వాములను చేయాలని నిర్ణయించారు. బీసీఐఎఫ్ భవిష్యత్ రాజకీయ పార్టీగా మార్పు చేయడంపై మరింత విస్తృత సంప్రదింపులు అవసరమని, తుది నిర్ణయాన్ని భవిష్యత్‌లో తీసుకోవాలని సభ్యులు అభిప్రాయపడ్డారు.

బలమైన సంస్థాగత నిర్మాణం, సామాజిక న్యా యం సాధనే లక్ష్యంగా కార్యాచరణతో ముం దుకు వెళుతూ ప్రజల భాగస్వామ్యంతో ముందు కు వెళ్లాలని తీర్మానించారు. బీసీఐఎఫ్ జెండా, కండువా, లోగోలను ఆవిష్కరించా రు. ఆగస్ట్ 9న నల్గొండలో నిర్వహించే బీసీ సామాజిక న్యాయ పోరాట సభ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ వీరస్వామి, వైస్ చైర్మన్ బెనర్జీ, సభ్యులు సూరగోని రమేష్, కూరపాటి రమేష్, చంద్ర శేఖర్, ఇప్పనపల్లీ సాంబయ్య, శ్రీకాంత్, ఎం లింగేష్ యాదవ్, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.