‘పెద్ది’ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన మాజీ మంత్రులు
మహబూబాబాద్, జులై 30(విజయక్రాంతి): గుండెపోటుకు గురై యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గుండ్ల కండ్ల జగదీశ్ రెడ్డి , ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్రావు తదితరులు సమీక్షించారు. యశోద ఆసుపత్రిలో పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి స్వప్న ను పరామర్శిం చారు. ఈ సందర్భంగా నాయకులు ఆమెకు ధైర్యం చెబుతూ, పార్టీ శ్రేణులు, అభిమానులందరూ సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారని తెలిపారు.
ఎలాంటి అవసరం వ చ్చినా పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని కోరు తూ, సుదర్శన్ రెడ్డి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షించారు. ఈనెల 26న హనుమకొండలో గుండెపోటుకు గురైన పెద్ది సుదర్శన్ రెడ్డికి స్థానిక రోహిణి ఆసుపత్రిలో సిపిఆర్ నిర్వహించి అనంతరం మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉండడంతో ప్రస్తుతం వెంటిలేటర్ ద్వారా వైద్య సహాయం అందిస్తున్నారు.






