30-07-2025 08:58:25 PM
మండల వైద్యాధికారి డాక్టర్ నగేష్..
జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని మండల వైద్యాధికారి డాక్టర్ భూక్య నగేష్ నాయక్(Mandal Medical Officer Dr. Bhukya Nagesh Naik) అన్నారు. బుధవారం మండలంలోని తిమ్మాపురం జడ్పీహెచ్ఎస్ లో విద్యార్థులకు అవగాహన కల్పించారు. వర్షాకాలం దృశ్య ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కలుషిత నీరు,కలుషిత ఆహార పదార్థాలను తినడం వల్ల టైఫాయిడ్, నీళ్ల విరేచనాలు, బంక విరేచనాలు, కలరా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. వేడిగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలని, కాచి చల్లార్చి వడపోసిన నీటిని తాగాలని తెలిపారు. బయటి ఆహార పదార్థాలు తినకూడదని, పాముకాటుకు గురైతే తీసుకోవలసిన జాగ్రత్తల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ఓ బిచ్చు నాయక్, మండల నోడల్ అధికారి, ప్రధానోపాధ్యాయులు కుంభం ప్రభాకర్, ఏఎన్ఎం దుర్గమ్మ, ఉపాధ్యాయులు, ఆశాలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.