30-07-2025 08:51:20 PM
రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కంది రాజనర్సక్క బాధిత కుటుంబాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Former Minister Koppula Eshwar) పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా ఈశ్వర్ మాట్లాడుతూ, కంది రాజనర్సక్క కుటుంబంతో సుదీర్ఘమైన అనుబంధం ఉందని తెలిపారు. రాజనర్సక్క భర్త కంది రాజరత్నం తమతో పాటు విప్లవకార ఉద్యమంలో ఏర్పాటు చేసిన ఐఎఫ్టియు అనుబంధం గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం రిజిస్ట్రేషన్ మెంబర్ గా ఉంటూ కార్మిక సమాజానికి ఎనలేని సేవలు అందించడం జరిగిందని గుర్తు చేసుకున్నారు.
అలాగే కంది రాజనర్సక్క కూడా చాలా ఏళ్ళు ఆ సంఘనికి సేవలు అందిస్తూ రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీచేసినట్లు కూడా తెలిపారు. రాజనర్సక్క కుటుంబం సమాజానికి ఎన్నో సేవలు అందించినట్లు కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కెంగర్ల మల్లయ్య, కనకం శ్యాం, బోనగిరి నర్సింగ్, పాండు, మోహన్, బడికేల సంపత్, బిఅర్ఎస్ నాయకులు పొగుల మల్లయ్య, రెవెళ్లి ఓదేలు, గడ్డం రాజు, నండిపేట సదానందం, గాజుల చంద్రకిరణ్, తదితరులు పాల్గొన్నారు.