12 March, 2026 | 1:24 AM

వ్యక్తిగత వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండండి

28-04-2025 12:49 AM

- జడ్చర్ల బస్టాండ్ కంట్రోలర్ భాస్కర్ నాయక్ 

జడ్చర్ల ఏప్రిల్ 27 : ప్రయాణంలో వ్యక్తిగత వస్తువులను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని జడ్చర్ల బస్టాండ్ కంట్రోలర్ భాస్కర్ నాయక్ అన్నారు. ఆదివారం ఖమ్మం నుండి నారాయణపేట వెళ్తూ ఉండగా అశోక్ తన విలువైన మొబైల్ ఫోను జడ్చర్ల బస్టాండ్ లో మర్చిపోవడం జరిగింది.

ఈ విషయాన్ని గమనించిన కంట్రోలర్ ఫోను స్వాధీనం చేసుకొని సామెత వ్యక్తికి సమాచారం అందించి తిరిగి ఫోను ప్రయాణికుడు అశోక్ అందించారు.  కార్యక్రమంలో సెక్యూరిటీ లింగంపేట నర్సింలు, ఆర్టీసీ సిబ్బంది ఉన్నారు.